KCR Regular Press Meetsనలుగురికి నచ్చింది…కేసీఆర్ కు నచ్చదు. తాను ఏం చేయాలనుకున్నారో అది చేసేస్తారు. ఎవరేం అనుకున్నా సరే…డోంట్ కేర్ అంటుంటారు. కానీ సడెన్ గా కేసీఆర్ లో ఇంతటీ మార్పుకు కారణం ఎవరు…? సమాధానం హుజురాబాద్ ప్రజలదే అని చెప్పొచ్చు.

అధికారంతో ఉందన్న అహంతో నేలమీద నడవని కేసీఆర్…ఎప్పుడు ఆకాశంలో విహరిస్తారు. మంత్రులకు కూడా అందని గులాబీ నేత…ఇప్పుడు ప్రజల ముందుకు ప్రతిరోజూ రావటాన్ని ఏమనుకోవాలి. ప్రగతిభవన్ …లేదంటే ఫాంహౌజ్..వీటికే అంకితమయ్యే ముఖ్యమంత్రి…ఇప్పుడు రోజూ మీడియా సమావేశం నిర్వహించడం చర్చకు దారితీస్తోంది.

అసలు గులాబీ బాస్ చెప్పే మాటలకు…చేతలకు ఎలాంటి సంబంధం ఉండదన్నట్లుగా వ్యవహరిస్తుంటారన్న టాక్ ఎప్పటినుంచో ఉంది. కేసీఆర్ ప్రతిరోజూ మీడియా సమావేశం పెడతానంటూ ప్రటించిన సందర్భంలో…మీడియాతో సహా అందరూ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు.

కేసీఆర్ మాటలంటేనే అలా ఉంటాయని లైట్ తీసుకున్నారు. కానీ తాను చెప్పినట్లుగానే రెండో రోజు కూడా మీడియా సమావేశం పెట్టారు. గంటకు పైగా మాట్లాడారు. కేసీఆర్ లో ఇంతటి మార్పునకు కారణం హుజురాబాద్ ఓటర్లు మాత్రమేనని చెప్పొచ్చు. నాకు నేనే సాటి అన్న భ్రమలో ఇన్నాళ్లూ కేసీఆర్ ఉన్నారని…ఇప్పుడు ఆయన్ను మార్చే శక్తి ప్రజల్లో ఉందన్న అసలు విషయాన్ని తెలుసుకుని వరుసగా మీడియా సమావేశాలు పెడుతున్నారని జనం అనుకుంటున్నారు

కాగా ఇంతకు ముందు ప్రెస్ మీట్ ఉంటుందని చెప్పి…అర్థాంతరంగా ఆపేసిన రోజులు చాలానే ఉన్నాయి. ఆ తర్వాత ఎప్పుడో వచ్చేవారు..తాను చెప్పాల్సిన విషయం చెప్పి వెళ్లిపోయేవారు. కానీ హుజూరాబాద్ ఫలితం తర్వాత…నాలుగు రోజులు మౌనంగా ఉండిపోయారు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. తనపై వచ్చిన ఆరోపణలు చేసే వారి సంగతి చూశారు.

ఇక తనపై ఆరోపణలు చేస్తున్నవారి సంగతి తేల్చేందుకు ప్రతిరోజూ ప్రెస్ మీట్ పెడతానని చెప్పారు. అన్నట్లుగా చేశారు. ఏది ఏమైనా కేసీఆర్ లో ఇంతటి మార్పులు తీసుకొచ్చిన హుజూరాబాద్ ఓటర్లుకు దండం పెట్టాలి. గతంలో కేసీఆర్ ను ఇలా చూడలేదు…ఇంతటి మార్పుకు కారణమైన హుజురాబాద్ ఓటర్లకు తెలంగాణ మొత్తం కూడా రుణపడి ఉంటుందని చెప్పొచ్చు.