Justin Prabhakaran - Radhe shyamయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు జాతీయ స్థాయిలో స్టార్. దానితో ఆయనతో సినిమాలు తీసే విధానంలో కూడా కొంత మార్పు వస్తుంది. అయితే మ్యూజిక్ పరంగా ఆయన సినిమాల్లో వస్తున్న మార్పులు అభిమానులకు నచ్చడం లేదు. సాహో లో అనేక మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉండటం వల్ల సరైన అవుట్ ఫుట్ రాలేదని వారి భావన.

దీనితో ఈ సారి రాధే శ్యామ్ కు హిందీకి వేరుగా మ్యూజిక్ చేయించబోతున్నారు. దక్షిణాది కోసం ఒక మ్యూజిక్ డైరెక్టర్… బాలీవుడ్ కోసం అక్కడి స్టైల్ లో మ్యూజిక్ ఉండబోతుంది. యువ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలీ వెర్ష‌న్స్ కి సంగీత‌ దర్శ‌కునిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

తెలుగులో అతను ఇప్పటివరకూ డియర్ కామ్రేడ్ కు మాత్రమే మ్యూజిక్ చేశాడు. హిందీలో ఎవరు మ్యూజిక్ చేస్తారు అనేదాని మీద ఇంకా క్లారిటీ లేదు. అక్టోబ‌ర్ 23న‌ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా “బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్” పేరిట మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేస్తున్నారు. రాధేశ్యామ్ చిత్ర యూనిట్ ప్ర‌స్తుతం యూర‌ప్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది.

అన్ని కుదిరితే రాధేశ్యామ్ సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే అప్పటికి పరిస్థితులు మెరుగుపడకపోతే వేసవికి వాయిదా పడొచ్చు. ప్ర‌భాస్ స‌ర‌స‌న బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని “రెబ‌ల్‌స్టార్” డాక్టర్ యూ.వి. కృష్ణంరాజు గారు స‌మ‌ర్పించ‌గా, వంశీ, ప్ర‌మెద్‌, ప్రసీధ‌ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్నో సూప‌ర్‌హిట్స్ అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థలు గోపికృష్ణ మూవీస్, యూవి క్రియెష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై నిర్మిస్తున్నారు.