Justice for Dishaహైదరాబాద్ డాక్టర్ రేప్ మరియు హత్య కేసులో ఇప్పటికే నాలుగు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. అత్యంత క్రూరంగా ఆమెను బలాత్కరించి ఆ తరువాత పెట్రోల్ పోసి చంపేశారు. అయితే వారు మాత్రమే మృగాలు అంటే ఒప్పుకునే పరిస్థితులు కనిపించడం లేదు.

మరిన్ని మృగాలు మన మధ్యే సంచరిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పటికే కొంత మంది జరిగిన దారుణాన్ని సమర్థిస్తూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఒక ప్రముఖ పోర్న్ సైట్ లో దిశా రేప్ వీడియో కోసం దాదాపుగా ఎనిమిది లక్షల మంది సెర్చ్ చేశారట. ఒక యువతి జీవితాన్ని పాశవికంగా చిదిమేస్తే దానిని కూడా చూసి ఆనందించాలనే దారుణ మనస్తత్వం ఉన్న వారు మన మధ్యే ఉన్నారు.

నాలుగు మాత్రమే జైలుకు వెళ్లారు. మిగతా వారు పెద్ద మనుషులుగా ఇక్కడే చలామణి అవుతున్నారు. ఇది ఇలా ఉండగా నిర్భయ చట్టంలో బాధితురాలి పేరుతో పాటు.. కుటుంబ సభ్యుల వివరాలను బయట పెట్టవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శంషాబాద్ బాధితురాలి పేరును కూడా మార్చాలని నిర్ణయించారు.

ఇక మీదట ‘దిశ’ పేరు మీదే వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. బాధితురాలి లేదా ఆమె కుటుంబ సభ్యుల ఫోటోలు, వివరాలు వెల్లడించొద్దని పోలీసులు సూచించారు. బాధితురాలి ఫొటోలు, ఆమె తల్లిదండ్రులు, సోదరి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున ప్రచారం కావడంతో.. పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.