jurassic-world-fallen-kingdom“అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్” ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ ఏకంగా 300 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయ్యేందుకు మార్గం సుగమం చేసుకుంటూ సరికొత్త రికార్డులు సృష్టిస్తుండగా, మరో మాసంలో ఇంకో హాలీవుడ్ బొమ్మ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైకి దాడి చేయడానికి సిద్ధమవుతోంది. అవును… ‘జురాసిక్ వరల్డ్’ సిరీస్ లో భాగంగా ‘ఫాలెన్ కింగ్ డం’ పేరుతో సరికొత్త సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సన్నద్ధమవుతోంది.

విశేషం ఏమిటంటే… యుఎస్ లో రిలీజ్ కు రెండు వారాల ముందే ఇండియాలో రిలీజ్ చేయనున్నారు. 2300 స్క్రీన్లలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషలలో “ఫాలెన్ కింగ్ డం”ను జూన్ 8వ తేదీన విడుదల చేయబోతున్నారు. ‘జురాసిక్ వరల్డ్’ సిరీస్ లకు ఇండియాలో ఉన్న ప్రజాధరణ రీత్యా, ‘అవెంజర్స్’ రికార్డులను తిరగరాసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నది ట్రేడ్ పండితుల విశ్లేషణ. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంటోంది.