ఒక పరిణితి చెందిన నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఎంతటి అభినయాన్ని ప్రదర్శిస్తారో, ఒక వ్యక్తిగా అంతే పరిణితితో మాట్లాడతారని మరోసారి రుజువైంది. పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో చెన్నై వెళ్లి రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన విషయం తెలిసిందే. అలాగే ఆ సందర్భంలో ఎంత ఎమోషనల్ అయ్యారో మీడియా ద్వారా అందరూ వీక్షించారు.
ఇప్పుడిప్పుడో పునీత్ మరణం నుండి కోలుకున్న కుటుంబం, ఆ సందర్భంలో తాము చవిచూసిన అనుభూతులను మీడియాలలో పంచుకుంటున్నారు. ఆ క్రమంలో పునీత్ సోదరుడు శివ రాజ్ కుమార్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. దీంతో ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read – మార్పు ‘ఉనికి’ని ప్రశ్నిచకూడదుగా..?
‘నేనున్నాను అన్నా మీకు’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఎమోషనల్ గా అన్నారని శివరాజ్ కుమార్ ఉద్వేగంగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆపద వచ్చిన సమయంలో మన తెలుగు హీరోలు అండగా ఉండడం అనేది గర్వించదగ్గ విషయమే! ఇలాంటి ఓదార్పు మాటలే మానసికంగా కృంగిపోయి ఉన్న ఆయా కుటుంబాలకు కొండంత అండ!