Julie 2 Trailer Talk - Raai Laxmi, Ravi Kishen, Deepak Shivdasaniసినీ ఇండస్ట్రీలో హీరోయిన్ కావాలనుకున్న ఓ మహిళ పడిన కష్టాలేంటి? ఆమె ఎదగడంలో ఎలాంటి అనుభూతులను చవిచూసింది? ఎదిగిన తర్వాత ఆమె సంబంధాలు ఎలా ఉన్నాయి? ఏంటి “డర్టీ పిక్చర్” సినిమా గుర్తుకు వస్తుందా? సరిగ్గా అలాంటిదే గానీ, అది కాదు. ఆ సినిమాను సిల్క్ స్మిత జీవిత ఆధారంగా తెరకెక్కించగా, ఈ సినిమాను “జూలీ” సినిమాకు సీక్వెల్ గా రూపుదిద్దారు. విద్యాబాలన్ స్థానంలో లక్ష్మీ రాయ్ అందాల ప్రదర్శన చేసింది.

బాలీవుడ్ లో ఎలాగైనా గుర్తింపు తెచ్చుకోవాలని భావించిన లక్ష్మీ రాయ్, ఈ సినిమాలో అందాల ప్రదర్శనకు ఎక్కడా అడ్డంకులు చెప్పలేదన్న విషయం ఈ ట్రైలర్ లో లాస్ట్ షాట్ చెప్పకనే చెప్తుంది. ట్రైలర్ లో లక్ష్మీ రాయ్ ప్రదర్శించిన హాట్ హాట్ అందాల ప్రదర్శన మినహా పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఈ తరహా కధలు, సినిమాలు ఇప్పటికే బాలీవుడ్ లో కోకొల్లలుగా రూపొందాయి. అయితే ఆ సినిమాలకు, దీనికి తేడా కేవలం లక్ష్మీ రాయ్ మాత్రమే.