julie-2-theatrical-trailer-raai -laxmiరాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన “జూలీ 2” సినిమా మరో మూడు రోజుల్లో సిల్వర్ స్క్రీన్ పై ప్రత్యక్షం కానున్న నేపధ్యంలో… ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను విడుదల చేసింది. అంతకుముందు విడుదల చేసిన టీజర్ కు కొనసాగింపుగా ఈ ట్రైలర్ ఉందే తప్ప, ఏ మాత్రం కొత్తదనం లేదు. ఓ అమ్మాయి సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగడానికి చవిచూసిన అనుభవాల సమ్మేళనమే ఈ “జూలీ 2”గా కనపడుతోంది.

టీజర్ లో చూపించిన విధంగానే ట్రైలర్ లో కూడా లక్ష్మీ రాయ్ అందాల పైనే ఎక్కువగా ఫోకస్ చేయగా, కధ ఏమిటో కూడా రివీల్ చేసారు. విద్యాబాలన్ నటించిన ‘డర్టీ పిక్చర్’ మాదిరే ఈ ‘జూలీ 2’ కూడా ఉండబోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. లక్ష్మీ రాయ్ అందాల ఆరబోతకు ఓ కధను అల్లినట్లుగా కనపడుతున్న ఈ సినిమా 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన ‘ఓ జూలీ’ అనే మెలోడీ గానం మాత్రం వినసొంపుగా ఉంది.