Julie 2 - Teaser Trailer - Raai Laxmiతెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో నటించిన ముద్దుగుమ్మ లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో నటించిన “జూలీ 2” సినిమా విడుదలైంది. ఇప్పటివరకు పోస్టర్స్ లో ఊరిస్తూ వచ్చిన లక్ష్మీ రాయ్, ఈ టీజర్ ద్వారా ఆ అంచనాలను మరింతగా పెంచింది. అంతకుముందు ‘జూలీ’ సినిమాలో రెచ్చిపోయిన నేహాధూపియా కంటే, రెండాకులు ఎక్కువే చదివాను అన్న చందంగా లక్ష్మి రాయ్ కనిపించింది.

బోల్డ్ నెస్ గా కనిపించడమే కాదు, ఆ బోల్డ్ లో కూడా చాలా బ్యూటీఫుల్ గా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఒక్కో వస్త్రాన్ని తీసేస్తూ బ్యాక్ లెస్ లో లక్ష్మీ రాయ్ ఇచ్చిన ఫోజులు వీక్షకులకు మాంచి కిక్ ను పంచి ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు. దీంతో సెప్టెంబర్ 4వ తేదీన రాబోయే ధియేటిరికల్ ట్రైలర్ పై అంచనాలు మరింతగా పెరుగగా, సిల్వర్ స్క్రీన్ పై ఈ అందాల ఆరబోతకు అక్టోబర్ 6వ తేదీన ముహూర్తం ఖరారైంది.