Jagan Government warns chiranjeeviవైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల ఫార్ములాని మెగా స్టార్ చిరంజీవి ఆహ్వానించారు. అమరావతిలో డబ్బులు మొత్తం పెట్టేకంటే మూడు రాజధానులు గా అభివృద్ధి చెయ్యడం వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే దీని మీద మెగా అభిమానులు కూడా అప్పట్లో అసంతృప్తి వెళ్లగక్కారు.

అసలు రాజకీయాలలో లేని చిరంజీవి ఉన్నఫళంగా తెర మీదకు వచ్చి పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండ్ కు ఆపోజిట్ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? జనసేనను ఇబ్బంది పెట్టడం ఎందుకు అంటూ వారు అప్పట్లో ఆగ్రహించారు. అయితే అమరావతి జేఏసీలో ఉన్న ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ ఈ విషయంగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.

మూడు రాజధానులకు అనుకూలంగా చిరంజీవిని బెదిరించి మాట్లాడించారని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ వ్యాఖ్యలు చెయ్యడం గమనార్హం. పైగా ఈరోజు పేపర్ లో సాక్షి ఈ విషయాన్నీ ప్రముఖంగా ప్రస్తావించింది. చిరంజీవి అభిమానుల పేరుతో మెగా స్టార్ ను వెనకేసుకొచ్చింది.

“చిరంజీవిని బెదిరించి మాట్లాడించారన్న శ్రీనివాస్‌పై చిరంజీవి అభిమానులు మండిపడుతున్నారు. చిరంజీవికి వ్యక్తిగతంగా ఓ అభిప్రాయం ఉండదా అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. కులాల మధ్య చిచ్చురేపే ప్లాన్‌ లేకుండా ఇలా మాట్లాడి ఉండరంటున్నారు,” అంటూ సాక్షి ప్రచురించడం విశేషం.