Jr NTR younger son first birthdayఈరోజు ఉదయం ఎన్టీఆర్ తన అభిమానులకు అద్భుతమైన ట్రీట్ ఇచ్చారు. రెండో కుమారుడు భార్గవ్‌ రామ్‌ శుక్రవారం తొలి పుట్టినరోజు సందర్భంగా తన ఇంస్టాగ్రామ్ ఎకౌంటులో తన పిల్లల ఫోటోలు విడుదల చేసాడు ఎన్టీఆర్. భార్గవ్‌ను ఎత్తకుని మురిపెంగా చూస్తున్న ఫొటోతో పాటు, పెద్ద కుమారుడు అభయ్‌ తన తమ్ముడి పక్కన కూర్చున్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇద్దరు పిల్లలు ముద్దులు మూటగడుతున్నారు.

భార్గవ్‌ రామ్‌ అయితే పెద్ద ఎన్టీఆర్ ను పోలి ఉండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. హీరో ఈ ఫొటోలు పోస్ట్‌ చేసిన కొద్దిసేపటికే దాదాపు రెండు లక్షల 16 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అందరూ భార్గవ్‌ను ‘లిటిల్‌ టైగర్‌’ అని సంబోధిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హాలీవుడ్ నటి డైజీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె పాత్ర కోసం ఇంకా వేట కొనసాగుతుంది. జులై 30, 2020 తారీఖున విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందం. బాహుబలి లగే తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషలలో ఒకేరోజు విడుదల కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో విడుదల కాబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.