Big-Difference-Between-Nani-Bigg-Boss-&-NTR-Big-Bossజూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి? బొమ్మకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద ఆల్ టైం రికార్డులు నెలకొల్పాల్సిందే. అది జూనియర్ ఎన్టీఆర్ రేంజ్! కట్ చేస్తే… నాచురల్ స్టార్ నాని స్థాయి ఏంటి? బ్లాక్ బస్టర్ టాక్ వస్తే… నాని కెరీర్ లో ఆల్ టైం రికార్డు నమోదవుతుంది. అది నాచురల్ స్టార్ మార్కెట్! మరి ఈ ఇద్దరినీ పోల్చడం సరైన విషయమేనా? కాకపోతే ‘బిగ్ బాస్’ షో వీరిద్దరినీ కంపేర్ చేసేలా చేస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ‘బిగ్ బాస్’ సీజన్ 1 తొలి ఎపిసోడ్ తో, నాని హోస్ట్ చేస్తోన్న ‘బిగ్ బాస్’ సీజన్ 2 ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్స్ పోల్చడం చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ హోస్టింగ్ కు 16 కు పైగా టీఆర్పీ నమోదు కాగా, నాని హోస్టింగ్ ఎపిసోడ్ కు 15.05 రేటింగ్ వచ్చాయి. తారక్ తో పోలిస్తే తక్కువే అయినప్పటికీ, నాని స్థాయికి ఇది ఎక్కువే అని చెప్పకతప్పదు. తొలి రెండు వారాలు జూనియర్ కూడా కాస్త తడబడగా, నాని కూడా అదే బాటలో పయనిస్తున్నాడు.

నాని హోస్టింగ్ పై ఇంకా పర్ ఫెక్ట్ పిక్చర్ రావడానికి మరికొంత సమయం పడుతుంది. స్టార్ మాతో దృష్ట్యా చెప్పాలంటే… జూనియర్ కంటే నాని హోస్టింగ్ వారికి ఎక్కువ లాభాలను తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే తారక్ రెమ్యూనరేషన్ ను, నాని పారితోషికాన్ని ఎక్కడా పోల్చలేం కదా! టీఆర్పీ విషయంలో కేవలం ఒకే ఒక్క పాయింట్ తేడా కాగా, పారితోషికం విషయం ఎంత తేడా ఉంటుందో అంచనా వేసుకోవచ్చు.