Bheem For Ramaraju - RRRఆర్‌ఆర్‌ఆర్ మేకర్స్ ఈరోజు రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌గా సినిమాలోని అతని క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఒక నిముషం, 13 సెకండ్లు ఉన్న వీడియో మెగా అభిమానులను పిచ్చెక్కించింది. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ అదిరిపోయాడు.

రామ్ చరణ్ శరీర పరివర్తన అదిరిపోయింది. రాజమౌళి విజువల్స్, వీడియో కట్ అద్భుతంగా ఉన్నాయి. ఈ వీడియోని మరింత రక్తికట్టించింది ఎన్టీఆర్ వాయిస్ ఓవర్. ఫక్తు తెలంగాణ యాసలో తారక్ అద్భుతంగా అల్లూరి పాత్ర గురించి విశేషంగా చెప్పి డైలాగ్ డెలివరీలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించాడు.

ఇక మే 20 న ఎన్టీఆర్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోను తారక్ బర్త్ డే, మే 20న విడుదల చేసే అవకాశం ఉంది. ఈ వీడియోకు వచ్చిన అద్భుత స్పందన తో మే 20 న అంచనాలను అందుకోవడం అంత సులభం కాదు. కానీ రాజమౌళి దర్శకుడు కాబట్టి మనం ఎప్పుడూ హైప్ మరియు అంచనాలను పెంచుకోవచ్చు.

ఆర్‌ఆర్‌ఆర్‌ను 2021 జనవరి 8 న సంక్రాంతి స్పెషల్‌గా సిద్ధం చేస్తున్నారు. కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోవడంతో సినిమా మరో సారి వాయిదా పడుతుందని వదంతులు వస్తున్నాయి. దీనితో అటువంటిది ఏమీ లేదని రాజమౌళి ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు.