Jr Ntr tweets ram charan and his son abhay ram photosయంగ్ టైగర్ ఎన్టీఆర్ పెళ్లి రోజు సందర్భంగా హీరో రామ్ చరణ్ దంపతులు ఇటీవల ఆయన నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో రామ్ చరణ్ అండ్ కో పాల్గొని సందడి చేశారు. ఏ సందర్భంలో తీసిన ఫోటోనో గానీ… బ్యాక్ గ్రౌండ్ లో ఎన్టీఆర్… ఫోర్ గ్రౌండ్ లో రామ్ చరణ్ ఉన్న ఫోటోను జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ చేయడంతో, అది కాస్తా వైరల్ అయ్యింది. వీరిద్దరూ కలిసి చేస్తోన్న మల్టీస్టారర్ సందర్భంగా ఇరువురు మరింత కలిసిపోతూ అభిమానులకు ఓ సందేశాన్ని పంపుతున్నారు.

ఈ ఫోటోను శనివారం వేకువజామున పోస్ట్ చేయగా, సాయంత్రం సమయానికి తన కొడుకు అభయ్ అండ్ సతీమణి ప్రణతిల ఫోటోను పోస్ట్ చేసాడు యంగ్ టైగర్. కొడుకు అభయ్ కు పాలు తాగించే విషయంలో వాళ్ళమ్మ నుండి ఎవరూ రక్షించలేరు అంటూ ఓ లవ్లీ ఫోటోను జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ చేసారు. పోలీస్ – దొంగ మాదిరి కనపడుతున్న ఈ ఫోటో చూడముచ్చటగా ఉంది. సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ నుండి ఇలా గంటల వ్యవధిలో ట్వీట్స్ రావడం, అది కూడా సినిమాయేతరంగా రావడం ఇదే మొదటిసారి!