Potential-Spoilsports-For-Jr-NTR‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా షూటింగ్ జరుపుకుంటోన్న సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో సిద్ధమవుతోందన్న సంగతి తెలిసిందే. దసరా కానుకగా విడుదల చేయాలని పక్కా ప్లానింగ్ తో త్రివిక్రమ్ ఈ సినిమా షూటింగ్ కు సన్నాహాలు చేసినట్లుగా తెలుస్తోంది. అనుకున్న ప్రకారమే తొలి షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చేత రాయలసీమ మాండలికంతో తన మాటల తూటాలను పలికించబోతున్నారని సమాచారం. రాయలసీమ నేపధ్యంలో జూనియర్ ఎన్టీఆర్ గతంలో చాలా సినిమాలు చేసారు గానీ, అందులో భాష యొక్క యాస సాధారణంగానే ఉంటుంది. కానీ ఈ సినిమాలో పక్కా రాయలసీమ మాండలికంతో తారక్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

‘అజ్ఞాతవాసి’ వంటి దారుణమైన పరాజయాన్ని చవిచూసిన త్రివిక్రమ్, పట్టుదలతో ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లుగా టాక్. సీమ ఫ్యాక్షనిజంతో పాటు పొలిటికల్ యాంగిల్ కూడా ఈ సినిమాలో ఉండనుందని మరో వార్త. గతేడాది దసరాకు ‘జై లవకుశ’ సినిమాతో అభిమానులను పలకరించిన తారక్, ఈ దసరాకు ఎలాంటి హంగామా సృష్టిస్తాడో చూడాలి.