Jr NTR Trivikram mass movieయంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక సినిమా ప్రకటించారు. గత ఏడాది వేసవిలో సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉండగా కరోనా కారణంగా ఇప్పటిదాకా జరగలేదు. ఈ వేసవి టైంకైనా సెట్స్ మీదకు వెళ్తుందని అనుకుంటున్నారు. ఈ సినిమాకు చౌడప్ప నాయుడు అనే టైటిల్ అనుకుంటున్నారు అని వార్తలు వస్తున్నాయి.

దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్సే హ్యాపీగా లేరు. “త్రివిక్రమ్ క్లాస్ సినిమాలు తియ్యడంలో దిట్ట. అటువంటి సినిమా చేస్తే అల వైకుంఠపురంలో వంటి పెద్ద హిట్స్ వస్తాయి. అటువంటి డైరెక్టర్ తో మాస్ సినిమాలు చేస్తే ఏం ఉపయోగం? ఎన్టీఆర్ స్టైల్ లో త్రివిక్రమ్ సినిమా చేస్తే ఉపయోగం ఉండదు. త్రివిక్రమ్ స్టైల్ సినిమానే చెయ్యాలి,” అని వారి అభిప్రాయం.

త్రివిక్రమ్ స్టైల్ సినిమా చేస్తే పెద్ద హిట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో ఫ్యామిలీ అండ్ యూత్ ఆడియన్స్ కి ఎన్టీఆర్ మరింత దగ్గర అవుతాడు. గతంలో అరవింద సమేత విషయంలో కూడా అలాంటి తప్పే చేసి అవకాశాన్ని ఎన్టీఆర్ మిస్ చేసుకున్నాడు అని వారు అభిప్రాయపడుతున్నారు.

“మాస్ సినిమాల కోసం ప్రశాంత్ నీల్, లోకేష్ వంటి వారు ఉన్నారు. త్రివిక్రమ్ ని త్రివిక్రమ్ బలం మేరకే వాడుకుంటే మంచిది. ఈ టైటిల్ గనుక నిజం అయ్యి… ఎన్టీఆర్ త్రివిక్రమ్ మరో మాస్ సినిమా చేస్తే… ఎన్టీఆర్ ని ఎవరు కాపాడలేరు? కేరీర్ ప్లాన్నింగ్ సరిగ్గా ఉంటేనే నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం సాధ్యం,” అని ఫ్యాన్స్ అంటున్నారు.