Jr NTR to sing for Baahubali 2, Jr NTR Song Baahubali 2, Jr NTR Role Baahubali 2, Jr NTR Singing Baahubali 2 Song, Jr NTR Croon Baahubali 2 Song‘బాహుబలి 2’కు సంబంధించిన తారాగణం అంతా ఎంపిక చేసుకుని, ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న తరుణంలో కొత్తగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఏంటి అనుకుంటే పొరపాటే. ఇప్పటికే భారీ నుండి అతి భారీ అంచనాలు ఏర్పడ్డ ఈ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ చరిష్మా కూడా తోడైతే ఇక ప్రేక్షకులను పట్టుకోగలమా? అందుకే ‘బుడ్డోడు’ సేవలను ‘జక్కన్న’ సిల్వర్ స్క్రీన్ వెనుక ఉపయోగించుకోబోతున్నారు అనే కొత్త వార్త పుట్టుకొచ్చింది.

వెండితెర మీద ఎంత బాగా అభినయించగల సత్తా ఉందో, వెండితెర వెనుక తన గాత్రంతో మైమరిపించగల సామర్ధ్యం ఉందని, ఈ ఏడాది విడుదలైన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఆలపించిన గానంతో చాటిచెప్పాడు. అదే స్వరాన్ని ‘బాహుబలి 2’ కోసం రాజమౌళి వాడుకుంటున్నారన్నది లేటెస్ట్ న్యూస్. ‘బాహుబలి 2’లో జూనియర్ ఎన్టీఆర్ చేత ఒక పాట పాడించబోతున్నారని హల్చల్ చేస్తున్న వార్తల్లో నిజం ఎంతుందో గానీ, సినీ వర్గాల్లో ఈ పుకారు 100 మైళ్ళ వేగంతో షికారు చేస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ సినిమాలో కూడా ఓ పాట పాడటంతో ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చినట్లు అవుతోంది. అలాగే రాజమౌళికి, జూనియర్ కు కూడా చక్కని సాన్నిహిత్యం ఉండడం మరింత అదనం. మరి దీనిపై ఎవరు స్పష్టత ఇస్తారో గానీ, అప్పటివరకు జూనియర్, యంగ్ రెబల్ స్టార్ అభిమానులకు ఉత్కంఠ తప్పదు.