Jr NTR - Politicsటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూర్ జిల్లా పర్యటనలో కొందరు జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీలోకి తీసుకురావాలని.. పార్టీ కోసం ప్రచారం చేయించాలని అధినేత ముందే నినాదాలు చేశారు. చంద్రబాబు ఎప్పటిలానే దాని మీద మౌనం దాల్చి తాను చెప్పదల్చింది చెప్పేసి ముందుకు కదిలారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ దీని మీద చాలానే ఆశలు పెట్టుకున్నట్టు ఉంది. జూనియర్ ఎన్టీఆర్ విషయం తెరమీదకు తెచ్చి టీడీపీలో చీలిక తెచ్చే ప్రయత్నం చేశారు.

అయితే తెలుగుదేశం వరకూ ఇది ఇప్పటికే ముగిసి పోయిన వ్యవహారం అని చెప్పుకోవాలి. టీడీపీకి ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్ ఉన్న విషయం తెలిసిందే. కారణం ఏదైనా అందుకు అనుగుణంగానే రెండు వైపుల వారు తమ తమ పనులు చేసుకుంటూ పోతున్నారు. ఎన్టీఆర్ ఇప్పట్లో తనకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదని సినిమాల లో బిజీ గా ఉంటున్నాడు. సొంత అక్కను నిలబెట్టిన నాడు కూడా టీడీపీకి ప్రచారం చెయ్యలేదు.

కీలకమైన 2019 ఎన్నికలలో కూడా టీడీపీ ఎన్టీఆర్ సాయం కోరలేదు. మొత్తానికి ఈ విషయంగా ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇరువైపుల అభిమానులు కూడా ఈ విషయం లో ఒక అభిప్రాయానికి వచ్చేశారు. ఎవరికి ఇప్పట్లో కలిసి పనిచేస్తారు అనే నమ్మకాలు లేవు. కొత్తగా ఎన్టీఆర్ వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చి టీడీపీ ని ఇబ్బంది పెడదాం అనే పచ్చిక పారదనే చెప్పుకోవాలి. టీడీపీ, ఎన్టీఆర్ అభిమానుల వరకు ఇది ఎప్పుడో ముగిసిపోయిన అధ్యయం.

కొంత మంది అభిమానులకు ఏవేవో ఆశలు ఉండవచ్చు గాక అయితే మొత్తం గా ఈ విషయానికి రాజకీయ ప్రాధాన్యత ఉండదు. సోషల్ మీడియాలో సందడి కారణంగా సాక్షి ఈ అంశం మీద చాలానే ఆశలు పెట్టుకున్నట్టు ఉంది. చిత్తూర్ జిల్లా పర్యటనలో చంద్రబాబు కు పదే పదే ఇదే అనుభవం ఎదురవడంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక మూడు రోజుల పర్యటనను మధ్యలోనే నిలిపేశారని సాక్షి పదే పదే ప్రచారం చెయ్యడం విశేషం.