Jr NTR - Nandamuri - Kalyan- Ramదివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని కూకట్ పల్లి నుండి తెలుగు దేశం అభ్యర్థిగా నిలిపారు చంద్రబాబు నాయుడు. దీనితో పార్టీకి దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ పార్టీకు దగ్గరవుతారని అంతా భావించారు. తారక్, కళ్యాణ్ రామ్ ల ప్రచారానికి షెడ్యూల్ ఖరారయ్యింది అని కొన్ని పత్రికలలో వార్తలు కూడా వచ్చాయి. కానీ అది ఇప్పటివరకూ జరగలేదు. దీనితో అసలు తారక్ వచ్చే అవకాశం లేదని మళ్ళీ వార్తలు వస్తున్నాయి. ఆయన మీద ఒత్తిడి పెట్టడానికే ఆ వార్తలు వేయించారని కొందరి ఆరోపణ.

మరోవైపు కళ్యాణ్ రామ్ కు ప్రచారంకు వెళ్లాలని ఉన్న ఎన్టీఆర్ వెళ్లనీయడం లేదని ఒక మీడియా వర్గం ప్రచారం చేస్తుంది. కొన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒక మాట మీద ఉంటున్నారు. ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి కొంచెం దూరంగా ఉన్నా, కళ్యాణ్ రామ్ మాత్రం అందరితోనూ మంచి సంబంధాలే కలిగి ఉన్నారు. ఈ క్రమంలో ఆయనను కూకట్ పల్లి అభ్యర్థిగా పెట్టాలని తెలుగు దేశం పార్టీ భావించింది అయితే ఎన్టీఆర్ ప్రభావంతో కళ్యాణ్ రామ్ ఒప్పుకోలేదు.

దీనితో నందమూరి సుహాసిని తెర మీద కు వచ్చారు. ఇప్పుడు ప్రచారానికి కూడా కళ్యాణ్ రామ్ రాకపోవచ్చని సమాచారం. ఆడపడుచు కష్టపడుతుంటే ఇంట్లో కూర్చుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని కళ్యాణ్ రామ్ మధనపడుతున్నారట. ఇదే క్రమంలో ఎన్టీఆర్ మాట కాదనలేని పరిస్థితి. దీనితో ఆయన సుహాసిని మద్దతుగా తన సతీమణి స్వాతి ప్రచారానికి పంపించారు. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మా వదిన సుహాసినిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మరోవైపు కుటుంబపరంగా పార్టీ పరంగా తారక్ మీద ప్రచారానికి రావాలని ఒత్తిడి కొనసాగుతుంది.