sukumar nannaku prematho trailer talkప్రస్తుతం ఆడియో చార్ట్ బస్టర్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గాత్రం అందించిన “ఫాలో ఫాలో” అనే పాట టాప్ స్థానంలో ఉంది. ఒక ప్రొఫెషనల్ గాయకుడు మాదిరి ఎన్టీఆర్ స్వరం ఉండడంతో ఈ పాటకు అన్ని వర్గాల నుండి ఈ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఎన్టీఆర్ గానం అందించిన సినిమాల సెంటిమెంట్ చూసి ‘యంగ్ టైగర్’ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ పాడిన ‘కంత్రీ’ సినిమాలో ‘వన్… టు… త్రీ… నేనొక కంత్రీ…’ అనే పాట సూపర్ హిట్ అయ్యింది. అయితే ఎన్టీఆర్, మణిశర్మలకున్న క్రేజ్ రీత్యా అప్పట్లో ఆ పాటకు ఆదరణ లభించింది గానీ, ఎన్టీఆర్ స్వరం వినడానికి కాస్త ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. ఆ తర్వాత ‘అదుర్స్’ చిత్రంలో ‘చారి… చారి..’ పాట ద్వారా మరోసారి ప్రేక్షకులను పలకరించిన ఎన్టీఆర్, మళ్ళీ సూపర్ హిట్ అందుకున్నారు. అలాగే ‘రభస’ చిత్రంలో ‘రాకాసి రాకాసి’ అంటూ మళ్ళీ అభిమానులను ఆకట్టుకున్నారు.

అయితే ఎన్టీఆర్ పాడిన ప్రతి సందర్భంలో పాటలు హిట్టయ్యాయి గానీ, సినిమాలు మాత్రం తుస్సుమన్నాయి. ఉన్నంతలో ‘అదుర్స్’ సినిమా పర్వాలేదనే వసూళ్లను సాధించింది గానీ, వినాయక్ – ఎన్టీఆర్ ల రేంజ్ విజయాన్ని గానీ, సినిమాపై ఉన్న అంచనాలను గానీ అందుకోలేకపోయింది. మరి ఈ సెంటిమెంట్ తో ‘ఫాలో ఫాలో…’ అనే పాట కూడా సూపర్ హిట్ అవ్వడంతో “నాన్నకు ప్రేమతో” సినిమాపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ సారైనా ఎన్టీఆర్ ‘ఫేట్’ మార్చే సినిమాగా ఈ ‘పాట’ మారుతుందేమో చూడాలి.