మహేష్ – చెర్రీ – తారక్ కాంబోలో సినిమా?

Jr NTR ready to do movie with Mahesh Babu - Ram Charan Movie‘రంగస్థలం, భరత్ అనే నేను’ సినిమాలు విజయవంతం అయిన సమయంలో మహేష్ – చెర్రీ – ఎన్టీఆర్ లు చాలా విరివిగా కలుసుకున్నారు. ఒకరి ఫంక్షన్లకు ఒకరు వెళ్ళడం… ఒకరి సక్సెస్ లను మరొకరు సెలబ్రేట్ చేసుకోవడం… ఇలా ఎక్కడ చూసినా ఈ ముగ్గురి హీరోల కలయికకు సంబంధించిన పిక్ లే సందడి చేసాయి. దీంతో ఈ ముగ్గురు కాంబోలో ఓ సినిమా రెడీ అవుతోందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఇపుడు ఇదే ప్రశ్న ‘యంగ్ టైగర్’కు ఎదురైంది. దానికి “మహేష్ – రామ్ చరణ్ – నేను కలిసి సినిమా చేయడానికి ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు గానీ, మా ముగ్గురిని హ్యాండిల్ చేయగల దర్శకుడు ఉండాలి కదా?!” అంటూ సినీ ప్రేక్షకులు ఎదురుచూసిన ప్రశ్నకు జవాబిచ్చారు. ‘ముందుగానే ప్లాన్ చేసుకుని సినిమాలు చేయలేం, ఒకవేళ అలాచేస్తే ఏమవుతుందో నాకు వ్యక్తిగత అనుభవం ఉందంటూ’ ఓ పంచ్ తనపైన తానే వేసుకున్నాడు.

బహుశా రికార్డులు కొట్టేయాలని ప్లాన్ చేసిన సినిమా, బాక్సాఫీస్ వద్ద చతికిలపడిన అనుభవమో ఏమో గానీ, తారక్ మాత్రం వాటిని లైట్ గా తీసుకుంటూ, ప్రస్తుతం అంతా వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నాడు. ‘ఓ మనిషి జీవితంలో మహిళ పాత్ర ఎంత ముఖ్యమో’ మా ‘అరవింద సమేత’ ద్వారా చెప్పామని, ‘యుద్ధం చేసే సత్తా లేని వాడికి శాంతి అడిగే హక్కు లేదు’ అన్నదే ఈ సినిమాలో హీరో పాటించే థీమ్ గా వెల్లడించారు యంగ్ టైగర్.

Follow @mirchi9 for more User Comments
Jagan-with-Prashant-Kishor-,-Latest-Photos!-(1)Don't MissJagan with Prashant Kishor, Latest Photos!Jagan with Prashant Kishor, Latest Photos!Pawan Kalyan Bhimavaram and Gajuwaka Results - Double Insult for Janasena PartyDon't MissDouble Insult for Pawan KalyanPawan Kalyan made his Electoral Debut with his Janasena Party and it ended up as...Landslide Victory for YSR Congress in Andhra PradeshDon't MissLandslide Victory for YSR Congress in Andhra PradeshIf you thought pollsters have over-estimated YSR Congress in Andhra Pradesh, you are in for...Here-is-the-First-and-Last-Result-in-Andhra-Pradesh--2019--ElectionsDon't MissHere is the First and Last Result in Andhra PradeshElection Commission has made all the arrangements for the Counting in Andhra Pradesh Tomorrow. The...Chandrababu-Naidu-Exhibiting-Two--Different-Body-LanguagesDon't MissNaidu Exhibiting Two Different Body LanguagesAs the counting day is nearing, tension is gripping about who would win Andhra Pradesh...
Mirchi9