
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బాహుబలి తరువాత విడుదల అవుతున్న సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని వచ్చే యేడాది జూలై 30న విడుదల చెయ్యబోతున్నాం అని నిర్మాతలు అప్పట్లో ప్రకటించారు.
అయితే తాజాగా సినిమా అప్పుడు విడుదల అయ్యే అవకాశం లేదని, అసలు 2020లోనే ప్రేక్షకుల ముందుకు రాకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లోని పరిస్థితిని బట్టి ఆర్ఆర్ఆర్ 2021 సంక్రాంతికి గానీ వేసవికి గానీ విడుదల అవుతుందని ఫిలింనగర్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి. షూటింగ్ అవ్వకపోవడమే కారణమని అంటున్నారు.
రాజమౌళి తన సినిమాలను శిల్పాలు చెక్కినట్టుగా చెక్కుతారు. ఆయన సినిమాలు వాయిదా పడటం అనేది సర్వసాధారణమే. అయితే చిత్రబృందం దీనిని ధృవీకరించాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.
ఇక ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హాలీవుడ్ నటి డైజీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ పాత్రలో ఎవరు చెయ్యబోతున్నారు అనేది ఇంకా చెప్పలేదు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. బాహుబలి లగే తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషలలో ఒకేరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.
What’s streaming on
OTT? Consult the experts!
Don't MissPower Play Review - Amateurish ThrillerBOTTOM LINE Amateurish Thriller OUR RATING 2/5 CENSOR 1h 57m, 'U/A' Certified. What Is the...
Don't MissA1 Express Review - Regular Sports Drama with Routine MassBOTTOM LINE Regular Sports Drama with Routine Mass OUR RATING 2.25/5 CENSOR 2h 18m, 'U'...
Don't MissShaadi Mubarak Review - Forgettable Marriage TrailBOTTOM LINE Forgettable Marriage Trail OUR RATING 1.75/5 CENSOR 'U' Certified, 2h 16m What Is...
Don't MissAdvance Booking: A 'Small' Big Week, Before Festive CrowdThis week as many as 11 films are hitting the cinemas. It includes direct and...
Don't MissJagan Government Secretly Shifting The CapitalViolating the Status Quo of the Court, Andhra Pradesh Government is secretly shifting its offices...