Jr Ntr, Jr Ntr Rajeev Kanakala Friendship, Jr Ntr Rajeev Kanakala Bonding, Jr Ntr Rajeev Kanakala Relationship Bonding, Ntr Rajeev Kanakala Uknown Details జూనియర్ ఎన్టీఆర్ – రాజీవ్ కనకాల మధ్య ఉన్న స్నేహబంధం గురించి అందరికీ తెలిసిన విషయమే. తారక్ నటించే సినిమాలలో మంచి మంచి రోల్స్ చేసిన రాజీవ్ నటన గురించి జూనియర్ చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు. తాజాగా ధియేటర్లలో సందడి చేస్తున్న “జనతా గ్యారేజ్”లో కూడా హైలైట్ సీన్ ఏంటి అంటే… ‘రాజీవ్ కనకాల సీన్’ అని ముక్తకంఠంతో చెప్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పైనే కాదు, తెరవెనుక కూడా అనుబంధం కలిగిన ఈ ఇరువురి మధ్య తాజాగా ఓ ఆసక్తికర సంభాషణ జరిగింది.

“ఓ నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఎంతో పరిణతి సాధించాడని, సన్నివేశానికి తగిన భావాన్ని మాత్రమే ప్రదర్శిస్తున్నాడని, దాంతో ఆ సన్నివేశాలు అద్భుతంగా పండుతున్నాయని, నటుడిగా అంతకంటే సాధించడానికి ఏమీ ఉండదని” జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా రాజీవ్ వైపు ఆనందంగా చూసిన ఎన్టీఆర్, ‘రాజు’ శభాష్ అంటూ కనకాలను సంభోదించాడు.

అయితే అసలు విషయం ఏమిటంటే… ‘రాజు’ అని పిలిస్తే రాజీవ్ కనకాలకు అస్సలు ఇష్టం ఉండదట. అందుకని రాజీవ్ కనకాల పేరును జూనియర్ ఎన్టీఆర్ తన మొబైల్ ఫోన్ లో ‘రాజు’ అని ఫీడ్ చేసుకున్నానని చెప్పాడు. మరి తన పేరు ఏమని రాజీవ్ ఎలా ఫీడ్ చేసుకున్నాడో తెలుసా? అని అడిగాడు. దానికి ఆయనే సమాధానమిస్తూ…’కిడ్’ అని ఫీడ్ చేసుకున్నాడని తారక్ తెలుపుతూ… ‘జనతా గ్యారేజ్’ ఇచ్చిన సక్సెస్ జోరును ఎంజాయ్ చేస్తున్నారు.