జూనియర్ కొత్త రాజకీయ పార్టీ... గుర్తు కూడా..! జూనియర్ ఎన్టీఆర్ జీవిత లక్ష్యం ఏమిటి? అన్న ప్రశ్న తారక్ ను అడిగితే… బహుశా జవాబును దాటవేస్తాడేమో గానీ, ఇదే ప్రశ్న ఇంకేవరిని అడిగినా జవాబు ఇట్టే లభిస్తుంది. ‘ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలోకి వస్తారు… తన తాత మాదిరి ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చుంటారు’ అని చెప్పేస్తుంటారు. ఎప్పుడూ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించలేదు గానీ, రాజకీయాలపై జూనియర్ ఎన్టీఆర్ కు చాలా మక్కువ ఎక్కువ కావడంతో కేవలం ట్రేడ్ వర్గాలలోనే కాక, సామాన్య ప్రేక్షకులలో కూడా ఇదే రకమైన బలమైన టాక్ ఉంది.

రియల్ పొలిటిక్స్ కు ఇంకా చాలా సమయం ఉంది గానీ, రీల్ పొలిటిక్స్ ను మాత్రం అతి త్వరలోనే ప్రేక్షకులకు పరిచేయం చేయబోతున్నారు జూనియర్. అవును… దసరా సందర్భంగా విడుదలకు ముస్తాబవుతున్న “జై లవకుశ” సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ లీడర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న ఓ ఫోటో దీనిని ఖరారు చేస్తోంది. ‘సమ సమాజ్’ పార్టీ పేరు కాగా, పాల క్యాన్ పార్టీ గుర్తుగా ఉన్న బ్యానర్లు, ఈ ఫోటో బ్యాక్ గ్రౌండ్ లో స్పష్టంగా కనపడుతున్నాయి.

దీంతో ఈ సినిమాలో ‘జై లవకుశ’ సినిమా కధా నేపధ్యం పొలిటికల్ యాంగిల్ లో ఉంటుందన్న కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అయితే బ్యానర్లపై ఇంగ్లీష్, హిందీ భాషలలో మాత్రమే అక్షరాలు ఉండడంతో, నార్త్ ఇండియాలో సాగే ఎపిసోడ్ అయ్యి ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మూడు విభిన్నమైన పాత్రలలో నటిస్తున్న తారక్, ఈ రాజకీయ నేత గల పాత్ర ఎవరిదై ఉంటుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. కాస్ట్యూమ్స్, గెటప్ చూస్తుంటే ‘జై’ పాత్ర అన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.