Jr NTR Political- campaignహరికృష్ణ మరణానంతరం సినిమాల పరంగా ఎలా ఉన్నా… తెలుగుదేశం పార్టీ పరంగా జూనియర్ ఎన్టీఆర్ వైఖరి ఎలా ఉండబోతోంది? అన్న ప్రశ్న అందరి మదిలో మెదిలింది. నిజమే… అంతకుముందు తెలుగుదేశం పార్టీ తరపున అద్భుతంగా ప్రచారం చేసిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ ప్రధముడు. మరి తండ్రి మరణంతో అలాంటి వ్యక్తి ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు? అనేది చాలా కీలకం.

ఇదే ప్రశ్న జూనియర్ ఎన్టీఆర్ కు ఎదురైంది. ‘అరవింద సమేత’ ప్రమోషన్స్ లో భాగంగా టిడిపిపై మీ అభిప్రాయం ఏంటి? అంటూ మీడియా వర్గాలు అడిగిన ప్రశ్నకు తారక్ సమాధానం చెప్పారు. “నిజానికి నాన్న మరణం నాకు ఇంకా జీర్ణించుకోలేదని, వెంటనే సినిమా షూటింగ్ కు వెళ్ళిపోవడం జరిగిందని, తనకు కొంత సమయం కావాలని, అందుకే సినిమా విడుదల తర్వాత కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుంటానని’ తెలిపారు.

“ఆ సమయంలో నన్ను ప్రశ్నించుకోవాలి, నాతో నేను మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి, నాలో ఉన్న అంతర్మధనం బయటకు రావాలి, ఆ తర్వాతే ఏ నిర్ణయమైనా… అంటూ బదులిచ్చారు. ఈ ప్రశ్న అడగడం తనను ఇబ్బంది పెట్టలేదని చెప్పిన ఈ తారకరాముడు ఫైనల్ గా ఎలాంటి నిర్ణయంతో ముందుకు వస్తారోనని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.