Jr NTR - Panja Vaishnav Tejమెగా కుటుంబం నుండి వస్తున్న మరో హీరో పంజా వైష్ణవ్ తేజ్. అతని మొదటి చిత్రం… ఉప్పెన ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాకు దేవి ఇచ్చిన సూపర్ మ్యూజిక్ కారణంగా సినిమా మీద హైప్ భారీగా ఉంది. బంపర్ ఓపెనింగ్ ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వైష్ణవ్ తేజ్ ఆసక్తికర విషయం చెప్పారు.

“ఒక రోజు ఫ్రెండ్స్ తో కాఫీ షాప్ లో ఉన్నా. ఓరోజు స‌డ‌న్ గా ఫోన్ చేసి `నా పేరు ఎన్టీఆర్‌.. మా ఇంటికి వ‌స్తావా` అన్నారు. క్ష‌ణాల్లో ఆయ‌న ముందు వాలిపోయా. అక్కడ చూస్తే అక్కడ అంతా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆ తరువాత చరణ్ అన్న కూడా వచ్చాడు. ఎన్టీఆర్ న‌న్ను ఓ త‌మ్ముడిలా చూస్తుంటారు. నాతో నే కాదు.. అన్న‌య్య‌తోనూ అలానే ఉంటారు,” అంటూ చెప్పుకొచ్చాడు వైష్ణవ్ తేజ్.

“ఎన్టీఆర్ అన్న చాలా స‌పోర్ట్ చేశారు. చాలా హైప‌ర్ గా ఉంటారు. తరచు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. నా భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి అడుగుతూ ఉంటారు,” అన్నాడు వైష్ణవ్ తేజ్. ఆ తరువాత ఉప్పెన ట్రైలర్ ఎన్టీఆర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ లో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. వారిద్దరూ బయట కూడా అంతే క్లోజ్ గా ఉంటారని వైష్ణవ్ తేజ్ చెప్పాడు. విశేషం ఏమిటంటే హీరోలు ఇంతా క్లోజ్ గా ఉంటే వారి అభిమానులు మాత్రం సోషల్ మీడియాలోను, బయట కొట్టుకుంటూ ఉంటారు.