Jr-NTR-Mahanatiఅగ్ర హీరోలు ట్విట్టర్ పెదాలు విప్పుతున్నారు. ‘రంగస్థలం’ సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ను ‘భరత్ అనే నేను’తో ఒక రేంజ్ కు తీసుకెళ్ళగా, తాజాగా “మహానటి” సినిమా విషయంలోనూ సెలబ్రిటీల ట్వీట్లు హోరెత్తుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘మహానటి’పై తన వర్షన్ ను కూడా తారక్ తెలియజెప్పాడు.

“మహానటి” అనుభూతిని వర్ణించడానికి తన మాటలు లేవని, బహుశా సావిత్రి గారే కీర్తి సురేష్ చేత అలా చేయించారేమో నాగ్ అశ్విన్ . ఈ సినిమా ద్వారా ఆమెకు ఘనమైన నివాళి అర్పించారు. ఈ సినిమాకు లైఫ్ ను అందించిన స్వప్న, ప్రియాంకలకు ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, దుల్కర్, సమంత, విజయ్ మరియు ఇతర కాస్టింగ్ లు అద్భుతంగా చేసారని, మిక్కీ మ్యూజిక్ బాగుందని, ఈ సక్సెస్ కు మీరంతా అర్హులు అంటూ ట్వీట్ చేసారు తారక్.

నిజమే… తారక్ అన్నట్లు “సావిత్రి గారే కీర్తి సురేష్ చేత అంత అద్భుతంగా చేయించారేమో” అన్న అనుభూతి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. సావిత్రి పాత్రను యాజిటిజ్ గా దించడం వేరు, ఏకంగా సావిత్రిని గుర్తు చేసే విధంగా నటించడం వేరు. అందుకే ఇటీవలే కాలంలో ఏ హీరోయిన్ కు లభించనంత కీర్తి ప్రతిష్టలు ఈ కీర్తికి సొంతం అవుతున్నాయి. ఈ ఏడాది ‘ఉత్తమ నటిమణి’గా కీర్తికి అవార్డులు కూడా దాసోహం అవుతాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.