NTR, NTR Tarak, NTR Likes Tarak Name, Jr NTR Likes Tarak Name, Jr NTR Loves Tarak Name NTR Loves Tarak Name, NTR Friends Call Tarak, NTR Family Calls Tarakప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతోంది. ఇందులో భాగంగా చిత్ర హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అన్ని మీడియా ఛానల్స్ కు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. సినిమా కధ, దర్శకుడు కొరటాల, సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి దాదాపుగా ఒకే విధమైన వ్యాఖ్యలు చేసిన జూనియర్, ఓ ఇంటర్వ్యూలో తన పేరుకు సంబంధించి మాత్రం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.

‘ఎన్టీఆర్ అని పిలిస్తే ఇష్టమా? లేక తారక్ అని అంటే ఇష్టమా?’ అని యాంకర్ ప్రశ్నించగా… ‘తన సన్నిహితులు, స్నేహితులు అంతా తారక్ అని పిలుస్తారని, తనక్కూడా తారక్ అని పిలిస్తేనే ఇష్టమని’ చెప్పిన జూనియర్, ‘ఎన్టీఆర్ అని పిలిస్తే చాలా భయంగా ఉంటుందని, ఆ మహానుభావుడి పేరు తనకు పెట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని, అయితే ఆయన పేరుతో తనను పిలిపించుకునేటంత అర్హత లేదని, అందుకనే భయం వేస్తుందని, ఆయన ఎక్కిన 100 మెట్లలో కనీసం ఒకటో, రెండో ఎక్కడానికే తన తాపత్రయం’ అని చెప్పుకొచ్చారు ఈ అభిమానుల బుడ్డోడు.

అంతకు ముందు చాలా అనర్గళంగా మాట్లాడే జూనియర్, ప్రస్తుతం మాత్రం చాలా ఆచితూచి, ఆలోచించుకుని మాట్లాడుతుండడం విశేషం. చిన్న చిన్న ప్రశ్నలకు కూడా సమయం తీసుకుని మరీ సమాధానాలు చెప్తుండడం తారక్ మారిన వైఖరికి అద్దం పడుతోంది. ‘జనతా గ్యారేజ్’ విడుదలైన తర్వాత ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, కాస్త టెన్షన్ గా కూడా ఉందని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ లో వచ్చిన మార్పు ‘జనతా గ్యారేజ్’ విడుదల తర్వాత కూడా ఉంటుందా? చూడాలి..!