Jr NTR likes Allu Arjun Danceటాలీవుడ్ లో డ్యాన్స్ ల విషయంలో బరిలో ఉండే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లలో ఎవరు బెస్ట్ డ్యాన్సర్? ఏ హీరో అభిమానులు ఆ హీరో పేరు చెప్పడం సహజం. అయితే ఇలాంటి ప్రశ్నే జూనియర్ ఎన్టీఆర్ ను అడిగితే… ఏం చెప్తారని అనుకుంటాం…? అవును… ప్రస్తుతం ‘జై లవకుశ’ ప్రమోషన్స్ లో ఉన తారక్ ను నిజంగానే ఓ యాంకర్ ఈ ప్రశ్న వేయగా, దానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా సూటిగా బదులిచ్చారు.

‘టాలీవుడ్ లో మీ ఫేవరేట్ డ్యాన్స్ స్టార్ ఎవరు?’ అంటూ యాంకర్ అడగగా… దానికి ఏ మాత్రం తడుముకోకుండా ‘బన్నీ’ అంటూ స్పష్టం చేసాడు తారక్. నిజానికి స్టైలిష్ డ్యాన్స్ లకు అల్లు అర్జున్, మాస్ బీట్స్ కు జూనియర్ ఎన్టీఆర్ స్టెప్పులు అందించడంలో అందరి కంటే ముందు వరుసలో ఉంటారని సినీ విమర్శకులు కూడా కితాబిచ్చారు. అయితే ఇలా ఒకరి హీరో పేరును మరో హీరో చెప్పడం మాత్రం బహు అరుదైన విషయమే.

దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సందడి చేస్తోంది. డ్యాన్స్ ల విషయంలో పోటాపోటీగా నిలిచే ఇద్దరిలో… బన్నీ పేరు తారక్ చెప్పడంలో అల్లు ఫ్యాన్స్ ఆనందంతో సదరు వీడియోను షేర్ చేసుకుంటూ పండగ చేసుకుంటున్నారు. ఇలాంటి అరుదైన వీడియోలకు ఆ మాత్రం హంగామా చేయడంలో తప్పులేదులే మరి..! అయితే సినిమాల విషయానికి వచ్చేపాటికి మళ్ళీ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య జరిగే ‘రచ్చ’ రొటినే..!