Jr NTR -KGF Director Prashant Neel movie ఒకే ఒక్క కన్నడ చిత్రంతో యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దృష్టి నీ తనవైపు తిప్పుకున్నాడు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్. త్వరలో విడుదల కాబోయే రెండో భాగం ఇంకెలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉండగా కెజీఎఫ్ రెండో భాగం రిలీజ్ అనంతరం ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు వచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ ఇద్దరి కాంబినేషన్ సినిమాను నిర్మించబోతుందట.

ఇక విషయానికి వస్తే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరు ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి చెప్పారు. “ఈ సినిమా మేము చేస్తున్న మాట వాస్తవమే. ఎన్టీఆర్ కు కేజిఎఫ్ నచ్చి దర్శకుడిని ఏదైనా మంచి కథ ఉందేమో అడగమన్నారు. ప్రశాంత్ నీల్ కథ చెప్పాల్సి ఉంది. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్, ప్రశాంత్ కేజిఎఫ్ 2 విడుదల అయ్యాకా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది, “అని నిర్మాత చెప్పారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేరీర్ లో ఇది ప్రతిష్టాత్మక 30వ సినిమా కావడం విశేషం.

బహుశా వచ్చే సంవత్సరం రెండవ భాగంలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళవచ్చు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రానున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ హీరో కు ఇచ్చే ఎలేవేషన్స్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. చాలా మంది కేజిఎఫ్ సినిమా చూస్తూ హీరో పాత్రలో ఎన్టీఆర్ ను ఊహించేసుకుంటున్నారు. ఈ సినిమా గనక తెర పైకి వస్తె బాక్స్ లు బద్దలవ్వడం పక్కా అనే చెప్పుకోవాలి. పైగా దేశవ్యాప్తంగా విడుదల అయ్యే అవకాశం ఉంది.