Jr NTR Kalyan Ram on Jai Lava Kusaమరికొద్ది గంటల్లో ప్రేక్షకులను పలకరించబోతున్న బాబీ – జూనియర్ ఎన్టీఆర్ ల “జై లవకుశ” సినిమా ఎలా ఉండబోతోంది? సామాన్య ప్రేక్షకులకు తెలియాలంటే సిల్వర్ స్క్రీన్ పై ఫస్ట్ షో పడాల్సిందే. మరి ఈ చిత్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ కు తెలియాలంటే… కధ విన్నది ఆయనే, చేసింది ఆయనే… ఇంకా కొత్తగా తెలియడానికి ఏముంటుంది..? అనుకుంటున్నారా..! ఖచ్చితంగా ఉంటుంది… తాము చేసిన సినిమాను సిల్వర్ స్క్రీన్ పై ప్రతి హీరో చూసుకుంటారు. కానీ “జై లవకుశ” విషయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఇది చేయలేదు.

అవును… కేవలం బిట్లు బిట్లుగా కొన్ని సన్నివేశాలను మాత్రమే చూసారు తప్ప, పూర్తి సినిమాను మూడు పాత్రలు చేసిన తారక్ కూడా వీక్షించలేదు. బహుశా ప్రేక్షకుల తీర్పు వచ్చిన తర్వాత చూద్దామని భావించారో ఏమో గానీ, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేసారు. ‘జై లవకుశ’ సినిమాను బాలయ్య బాబు చూసి మెచ్చుకున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉంది? అని యాంకర్ ప్రశ్నించగా, అందులో నిజం లేదని, బహుశా ధియేటర్స్ లోకి వచ్చాకా ఏమైనా చూస్తారేమో అంటూ జవాబిచ్చారు తారక్.

నిజానికి తన సినిమాను తానే పూర్తి చూసుకోలేదని, కేవలం అక్కడక్కడ కొన్ని షాట్స్ మాత్రమే చూశానని చెప్పడంలో సదరు యాంకర్ అవాక్కయ్యే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం తనకు టెన్షన్ గా ఉందని, అందుకే సినిమాను చూడలేకపోయానని, అయితే తన సోదరుడు, సినిమా నిర్మాత కళ్యాణ్ రామ్ మాత్రం చూసారని, ‘అవుట్ పుట్’ అద్భుతంగా వచ్చిందని తనకు చెప్పాడని, ఫ్యాన్స్ కు కావాల్సిన విషయాన్ని వెల్లడించాడు. బహుశా సినిమా ధియేటర్లలో తన అభిమానులతో కలిసి చూడాలని ‘బుడ్డోడు’ భావిస్తున్నారేమో..!