Jr-NTR-Kalyan-Ram-about-YSR-and-NTRఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై జూ.ఎన్టీఆర్‌ స్పందన చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంతకీ జూ.ఎన్టీఆర్‌ ఏమన్నారంటే, “వైఎస్సార్, ఎన్టీఆర్ ఇద్దరూ సమానమే. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదు. కనుక ఒకరి పేరు తొలగించి మరొకరి పేరు పెట్టడం వలన ఎవరి ప్రతిష్ట పెరగదు తగ్గదు,” అని ట్విట్టర్‌లో నిన్న మెసేజ్ పెట్టారు.

‘యూనివర్సిటీ పేరు మార్చడం తప్పు’ అని ఎన్టీఆర్‌ ధైర్యంగా చెప్పలేకపోయాడని అభిమానులు బాధ పడుతున్నారు. ఏపీలో తన సినిమాలకు వైసీపీ ప్రభుత్వం వలన ఇబ్బందులు ఎదురవకూడదనే ఉద్దేశ్యంతోనే ఎన్టీఆర్‌ ఆవిదంగా మాట్లాడారని అభిమానులు కూడా గ్రహించారు. కానీ ‘వైఎస్సార్, ఎన్టీఆర్ ఇద్దరూ సమానమే’ అంటూ జూ.ఎన్టీఆర్‌ చెప్పడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

సినీ, రాజకీయాలు, ప్రజాసేవతో తెలుగు ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకొన్న ఎన్టీఆర్‌ ఎక్కడ, కేవలం రాజకీయాలకే పరిమితమైన వైఎస్సార్ ఎక్కడ?అటువంటి వ్యక్తి ఎన్టీఆర్‌తో సమానమని ఆయన మనుమడైన జూ.ఎన్టీఆర్‌ చెప్పడమే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇంతకు ముందు వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు అర్దాంగి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా జూ.ఎన్టీఆర్‌ కూడా స్పందించలేదు. అయితే నారావారికి నందమూరి వారికి మద్య కొంత గ్యాప్ ఉన్నందున స్పందించకపోయి ఉండవచ్చని అభిమానులు సర్ది చెప్పుకొన్నారు.

ఎన్టీఆర్‌ మనుమడినని గొప్పగా చెప్పుకొంటున్న జూ.ఎన్టీఆర్‌ తాతలాగ ధైర్యంగా మాట్లాడలేకపోయినా పర్వాలేదు కానీ తాతకు ఈవిదంగా అవమానం జరుగుతుంటే ప్రత్యర్దుల పూజ్యనీయ నేతను వెనకేసుకురావడమే అభిమానులు షాక్‌ అవుతున్నారు.

ఈ విషయంలో జూ.ఎన్టీఆర్‌ కంటే కళ్యాణ్ రామ్ నయమనే వాదన కూడా వినిపిస్తోంది. కళ్యాణ్ రామ్ కూడా ఈ అంశంపై స్పందిస్తూ ఎన్టీఆర్‌ గొప్పదనాన్ని తెలియజేసినా తర్వాత రాజకీయ లాభం కోసం చాలా మంది భావోద్వేగాలతో ముడిపడున్న ఈ అంశాన్ని వాడుకోవడం తప్పు,” అని కాస్త సున్నితంగానైనా సూటిగా చెప్పాడని నందమూరి అభిమానులు అంటున్నారు.