Jr NTR - Instagram- Followersయంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటున్నాడు. తన సినిమాలకు సంబంధించిన విషయాలే కాకుండా తన కుటుంబ సభ్యులకు చెందిన విషయాలను కూడా పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. అప్పట్లో అరుదుగా ట్వీట్లు చేస్తూ కనపడిన తారక్‌ ఇప్పుడు ఏదో ఒక విషయంపై తరుచూ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నాడు.

ఇదే ఉత్సాహంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చిన తొలిరోజులో దాదాపుగా ఒక లక్షా యాభై వేల మంది ఫాలోవర్లు యాడ్‌ అయ్యారు. ఇందులో ఆయన తన మొట్టమొదటి పోస్ట్‌గా తన కొత్త సినిమా ‘అరవింద సమేత.. వీర రాఘవ’ పోస్టర్‌ను పోస్ట్ చేశాడు. కానీ తర్వాత దీనిని డిలీట్ చేసేసారు. ట్విట్టర్‌లో తారక్ కు రెండు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న విషయం తెలిసిందే.