Jr NTR in Yellow shirtతెలుగుదేశం పార్టీ రంగుగా కొలిచే పసుపు కలర్ షర్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి గాని, తారక్ వేసుకున్న షర్ట్ కు గానీ ఏ మాత్రం సంబంధం లేదు.

కానీ ఆ కలర్ తెలుగు తమ్ముళ్ళని, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ పిక్ సందడి చేస్తోంది. “ఆర్ఆర్ఆర్” చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా వేసుకున్న ఈ కాస్ట్యూమ్ లో తారక్ సూపర్ లుక్ లో కనిపించాడు.

ముఖ్యంగా కిటికీ గుండా వస్తోన్న సూర్యకిరణాలు జూనియర్ పై పడిన విధానం, తారక్ ఇచ్చిన స్టిల్ అభిమానులకు ‘ఐ ఫీస్ట్’గా మారింది. ధరించిన అన్ని కాస్ట్యూమ్స్ మీద కూడా ‘ఆర్ఆర్ఆర్’ బ్రాండ్ లోగో మాత్రం ఎక్కడా మిస్ అవ్వడం లేదు.

జనవరి 7వ తేదీన విడుదల కాబోతోన్న “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్స్ ఓ రేంజ్ లో సాగుతున్నాయి. ముంబైలో అద్భుతంగా సాగిన చిత్ర ప్రమోషన్స్ ప్రస్తుతం కబడ్డీని వేదిక చేసుకున్నాయి. రెండేళ్ల తర్వాత తిరిగి ప్రారంభమైన ప్రో కబడ్డీ లీగ్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు దర్శకుడు రాజమౌళిలు కలిసి ‘ఆర్ఆర్ఆర్’ పబ్లిసిటీ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ యుఎస్ బుకింగ్స్ గతవారమే విడుదల కాగా, తొలివారంలోనే హాఫ్ మిలియన్ డాలర్స్ పైగా వసూలు చేసింది. ఈ వారాంతానికి 1 మిలియన్ డాలర్స్ ను “ఆర్ఆర్ఆర్” కైవసం చేసుకుని యుఎస్ లో రికార్డు సృష్టించబోతోందని ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు.