jr-ntr-imitaiton-video-viral-on-web-2నోట్ల రద్దు అంశం సామాన్యుడిని, కుభేరులను ఏ విధంగా ప్రభావితం చేసిందో అందరికీ తెలిసిందే. దీంతో అసహనం కట్టలు తెంచుకుంటున్న ప్రజానీకం బ్యాంకుల ముందు గొడవలకు దిగుతున్నారు. మరో పక్కన నల్లకుభేరులు మాత్రం ఏకంగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారులతోనే లింక్ లు ఏర్పరచుకుని, పని కానీచ్చేసుకుంటున్నారు. తాము గంటల తరబడి లైన్ లలో నిల్చుంటే… మరో పక్కన నల్లకుభేరుల కోసం బ్యాంకు అధికారులు మాత్రం కరెన్సీని పక్కదారి పట్టించడం… అసలు ఆగ్రహానికి కారణం.

ఇదే ఆగ్రహాన్ని ఓ చిన్నపిల్లవాడి రూపంలో ‘టెంపర్’ సినిమా క్లైమాక్స్ ను వాడుకుని రూపొందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. దేశం కోసం సామాన్యులు చాలా చేస్తున్నారు… నల్లకుభేరులు మాత్రం అడ్డదారులలో సేఫ్ గా ప్రయాణం చేస్తున్నారనే కాన్సెప్ట్ తో ఆదయ అర్నావ్ అనే చిన్న పిల్లవాడు చేసిన ఈ వీడియో వీక్షకులను ఆకట్టుకుంటోంది. సూపర్ హిట్ సినిమాలలోని స్పూఫ్ లను చేయడం ఈ బుడతడి స్పెషాలిటీ కావడంతో… ఈ సారి ‘టెంపర్’ను వాడుకుని ఏకంగా మోడీ పైనే గురిపెట్టారు.