Jr Ntr Funny Comments on Dvv Danayyaదాదాపుగా 400 కోట్ల బడ్జెట్ తో “ఆర్ఆర్ఆర్” వంటి భారీ సినిమాను అయిదు భాషల్లో అయితే నిర్మించారు గానీ, మైక్ పట్టుకుంటే ‘థాంక్స్ అండ్ సారీ’ మినహా దానయ్య ఇంకేమి మాట్లాడరు. సంక్రాంతి రిలీజ్ అనుకున్న సమయంలో దానయ్య చేసిన ప్రమోషన్స్ కు సోషల్ మీడియాలో హిలేరియస్ మేమ్స్ ప్రత్యక్షమయ్యాయి.

థాంక్స్ చెప్పడానికి మాత్రమే స్టేజ్ ఎక్కే దానయ్య, చివరికి అది కూడా చెప్పాల్సిన వారందరికీ చెప్పకుండా మరిచిపోయి దిగిపోవడం, మరలా స్టేజ్ ఎక్కి ‘సారీ’ చెప్పి మళ్ళీ వారికి చెప్పడం లాంటి ఘటనలు సర్వసహజం. ఇందుకు కర్ణాటకలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఏమీ మినహాయింపు కాదు.

ఏకంగా హీరోలకు ‘థాంక్స్’ చెప్పడం మరిచిపోయిన దానయ్య, మళ్ళీ స్టేజ్ ఎక్కి ‘సారీ’ చెప్పి ఇద్దరు హీరోలకు ‘థాంక్స్’ చెప్పి స్టేజ్ దిగిపోయారు. నిర్మాత దానయ్య పరిస్థితి ఇలా ఉంటే, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈవెంట్ కు సెక్యూరిటీ అందించిన ఐజీతో సహా ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపి చివరిలో ఒకరిని మరిచిపోయారు.

ఈ సందర్భంలో ‘దానయ్య గారి రోగం నాకు అంటుకుందేమో!’ అంటూ ఛలోక్తులు విసిరారు. సోషల్ మీడియాను తారక్ కాస్త గట్టిగానే ఫాలో అవుతున్నట్లున్నారు. అందుకే నిర్మాత దానయ్య పైన ఏకంగా ట్రోలింగ్ మెటీరియల్ ను నెటిజన్లకు అందించారు ఎన్టీఆర్.