Jr NTR and Kalyan Ram Pays Tribute to NTR at NTR Ghat--మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 97వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వెలవెలబోయింది. పూలతో కలకలలాడాల్సిన సమాధి కల తప్పడంతో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ అసహనం వ్యక్తం చేశారు. కనీసం సమాధిపై పువ్వులు కూడా లేకపోవడంతో అసహనం వ్యక్తం చేసి, పువ్వులు చల్లారు. వెంటనే భారీగా పుష్పాలను తెప్పించి తానే స్వయంగా తాత సమాధిని అక్కడే ఉన్న అభిమానుల సాయంతో సమాధి మొత్తం పూలతో కలకలలాడేలా చేశారు.

తర్వాత పుష్పగుచ్చాలతో తారక్, కల్యాణ్‌రామ్ నివాళులు అర్పించారు. తాత సమాధి పక్కనే కాసేపు మౌనంగా కూర్చున్నారు. ఇక నుంచి తాత వర్ధంతి, జయంతి వేడుకల ఏర్పాట్లను తానే స్వయంగా చూసుకుంటానని ప్రకటించి జూనియర్ ఎన్టీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో పూర్తిగా కనుమరుగు కావడం, ఆంధ్రప్రదేశ్ లో ఓటమి చెంది కనీసం వారం కూడా కాకపోవడం ఆ ప్రభావమే ఇది. అయితే ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, అభిమానులు కూడా పట్టించుకోకపోవడమూ తప్పే కదా.

ఆ తరువాత ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన వారిలో దగ్గుబాటి పురందేశ్వరి, లక్ష్మి పార్వతి, నందమూరి సుహాసిని, తెలంగాణ టీడీపీ అధినేత ఎల్ రమణ ఉన్నారు. నందమూరి బాలకృష్ణ తాను ఎమ్మెల్యేగా హిందూపురం నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచిన అనంతరం సెంటిమెంట్‌గా భావించి తన నియోజకవర్గంలోనే ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. గుంటూరు జిల్లాలోని రాష్ట్ర కార్యాలయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి టీడీపీ జెండా ఎగురేశారు.