A Glimpse Of New ‘Brat’ In Jr NTR Familyజూనియర్ ఎన్టీఆర్ ఇంట రెండో వారసుడు వెలసిన విషయం తెలిసిందే. ఈ బాబుకు సంబంధించిన మొదటి ఫోటో ఇప్పటికే నెటిజన్లను పలకరించి అలరించింది. ఇంకా పేరు ఖరారు చేయని ఈ బుడతడు అన్నయ్య ఒడికి చేరుకున్నాడు. అవును… అభయ్ రామ్ ఒడిలో కూర్చోపెట్టుకోగా, దానిని జూనియర్ ఎన్టీఆర్ ఫోటో తీయడం… ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ గా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.

ఇంస్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తొలి ఫోటోగా దీనినే పోస్ట్ చేసారు. దీంతో ఇంస్టాగ్రామ్ లో ఈ ఫోటోకు లైక్ ల సంఖ్య దాదాపుగా ఒక లక్షకు చేరువ కావస్తోంది. అన్నయ్య చెంతన సేదతీరుతోన్న బుడ్డోడుని చూసుకుంటూ మురిసిపోవడం అభిమానుల వంతవుతోంది. రెండో తనయుడి జననం ముందు మరియు ఆ తర్వాత సోషల్ మీడియాలో యంగ్ టైగర్ కాస్త ఎక్కువగానే సందడి చేస్తుండడం గమనించదగ్గ అంశం.