jr-ntrకొరటాల శివ దర్శకత్వం వహించిన ‘జనతా గ్యారేజ్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాగా, ఈ సినిమా తర్వాత చిత్రాన్ని జూనియర్ ఇప్పటివరకు ప్రారంభించలేదు. అయితే ‘ఇజం’ ఆడియో వేడుకకు హాజరైన జూనియర్ ఎన్టీఆర్ లుక్ చూసి అభిమానులు షాక్ అయ్యారు. ‘బాహుబలి’కి పోటీ అన్నట్లుగా గుబురు గడ్డంతో దర్శనమిచ్చారు తారక్. గత రెండు సినిమాల నుండి గడ్డం లుక్ నే మైంటైన్ చేస్తున్న జూనియర్, సరికొత్త గడ్డం లుక్ తో మళ్ళీ వచ్చేసాడు.

‘ఇజం’ ఆడియో వేడుకలో పాల్గొన్న జూనియర్, మీసం మెలేస్తూ ఉండగా, కెమెరా కన్ను క్లిక్ మనిపించింది. ఇంకేముంది… యంగ్ టైగర్ అభిమానులు విపరీతంగా ఇష్టపడుతున్న ఈ ఫోటోను చూస్తూ రకరకాల కామెంట్స్, లైక్ ల మీద లైక్ లు… ఒకటేముందిలే… జూనియర్ అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. అయితే ‘జనతా గ్యారేజ్’ తర్వాత కనపడుతున్న ఫోటో కావడంతో… బ్లాక్ బస్టర్ వచ్చిందిగా… ఇక బుడ్డోడు మీసం మేలేసాడు… అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.