Jr-NTR-Bigg-Boss-Budgetబుల్లితెరపై మొదటిసారిగా జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్న ‘బిగ్ బాస్’ షో టాలీవుడ్ నాట హాట్ టాపిక్ గా మారింది. దీనికి ప్రధాన కారణాలు… తారక్ ఈ షోను నిర్వహించడం ఒకటైతే… ఈ షో కోసం నిర్వాహకులు కేటాయించిన బడ్జెట్ తో ఓ భారీ సినిమాను తెరకెక్కించవచ్చన్న సమాచారం మరొకటి. ‘బిగ్ బాస్’ సీజన్ 1 కోసం నిర్వాహకులు దాదాపుగా 50 కోట్లు ఖర్చు చేయబోతున్నారని తెలుస్తోంది.

ఇందులో సింహాభాగం జూనియర్ ఎన్టీఆర్ పారితోషికం క్రిందకే వెళ్ళిపోబోతోందని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక స్పష్టం చేసింది. ఇప్పటివరకు బుల్లితెరపై కనిపించిన బడా స్టార్స్ నాగార్జున, చిరంజీవిలు చార్జ్ చేసిన మొత్తానికంటే రెట్టింపు మొత్తాన్ని తారక్ తన ఖాతాలో వేసుకోబోతున్నట్లుగా సదరు కధనం సారాంశం. అలాగే ఈ షోలో 12 మంది సెలబ్రిటీలు పాల్గొననుండగా, ఇంతవరకు ఎవరెవరు పాల్గొంటారు? అనేది ఖరారు కాలేదు.

జూలై నెలలో ప్రారంభం కాబోయే ఈ షో తెలుగు బుల్లితెర టీఆర్పీ రేటింగ్స్ ను సమూలంగా మార్చివేస్తుందన్న నమ్మకంతో నిర్వాహకులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే బడ్జెట్ ఎక్కువైనా… జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో వైపుకే మొగ్గు చూపినట్లుగా సమాచారం. టీవీ వినోదం అనేది ఒక పవర్ ఫుల్ ఆయుధంగా తయారైందని చెప్తూ… తెలుగు నాట ‘ఇదొక గేమ్ చేంజర్’ అవుతుందని తారక్ అభిప్రాయ పడడం విశేషం.