jr-ntr-bigboss -abhayవ్యక్తిగత జీవితంలో ప్రిన్స్ మహేష్ బాబు చాలా సింపుల్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. అంతేకాదు తన పిల్లల పుట్టినరోజులు కూడా కేవలం కుటుంబ సభ్యుల నడుమ చాలా నిరాడంబరంగా జరుపుకుంటారు. ఇటీవలే 20వ తేదీన ముగిసిన మహేష్ గారాలపట్టి సితార జన్మదిన వేడుకలే ఇందుకు నిదర్శనం. తన ఇంట్లో చాలా సింపుల్ గా సితార పుట్టినరోజు జరిగిందన్న విషయం… సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఫోటోలు చెప్పకనే చెప్తున్నాయి. ఈ పుట్టినరోజే కాదు, ప్రతి ఏడాది ప్రిన్స్ పోకడ దాదాపుగా ఇలాగే ఉంటుంది.

అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా మహేష్ అంత కాకపోయినా కుటుంబ సభ్యులు, తనకు అత్యంత సన్నిహితుల నడుమ పార్టీలు జరుపుకోవడం అలవాటు. ప్రతిసారి ఇలాగే జరుపుకునే తారక్, ఈ సారి తన తనయుడు అభయ్ రామ్ పుట్టినరోజు వేడుకలకు ఏకంగా ‘బిగ్ బాస్’ షోలో జరపబోతున్నాడు. శని, ఆదివారాలు ‘బిగ్ బాస్’ కార్యక్రమం కోసం ముంబై, లూనావాలా వెళ్తున్న తారక్, ఈ శనివారం తన తనయుడు పుట్టినరోజు కావడంతో, అభయ్ ను కూడా తన వెంట తీసుకువెళ్ళాడు. అక్కడ హంగామా చూస్తుంటే గ్రాండ్ గానే పుట్టినరోజు జరిపినట్లుగా కనపడుతోంది.