Jr NTR Bheem - RRR Movieతెలుగు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమా పబ్లిసిటీ ఊపందుకుంది. విడుదలకు సరిగ్గా ఒక నెల రోజులు సమయం ఉన్న నేపథ్యంలో… అభిమానులకు కావాల్సిన అంశాలను రిలీజ్ చేసే పనిలో చిత్ర యూనిట్ ఉన్నట్లుగా ఈ లేటెస్ట్ పోస్టర్ స్పష్టం చేస్తోంది.

రెండు తాళ్లు పట్టుకుని జూనియర్ ఎన్టీఆర్ కూర్చున్న లుక్ వీక్షకులను ఫిదా చేస్తోంది. ఇక అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవనే చెప్పాలి. ఆగ్రహంతో చూస్తున్న జూనియర్ లుక్ అండ్ బాడీలో నరనరాలు కూడా కనిపించే విధంగా ఉన్న ఈ పోస్టర్ తో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

ఇప్పటివరకు రిలీజ్ అయిన “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ మెటీరియల్ లో ‘బెస్ట్’ కంటెంట్ గా ఈ పోస్టర్ ను పేర్కొనవచ్చు . అంతకు ముందు వచ్చిన రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్సింగ్ పోస్టర్ కూడా బాగానే ఉంది గానీ, ఈ ఎన్టీఆర్ పోస్టర్ మాత్రం గొప్పగా ఉంది. దీంతో సాయంత్రం రిలీజ్ కాబోయే రామ్ చరణ్ పోస్టర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.