ఎన్టీఆర్ మీద అభిమానం... సోషల్ మీడియా కష్టం పోయే ప్రమాదంయంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ అఫ్ ది మోస్ట్ పాపులర్ స్టార్. సోషల్ మీడియాలో ఆయన ఫాలోయింగ్ అయితే మైండ్ బ్లోయింగ్. చాలా మంది ఫ్యాన్స్ ఎంతో సమయం వెచ్చించి వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్ బిల్డ్ చేసుకుని తమ అభిమాన హీరోకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే వారి కష్టానికే ఎసరువచ్చింది.

వివరాల్లోకి వెళ్తే… ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు అనే షో కు హోస్ట్ గా చెయ్యబోతున్నారు. జెమినీ లో ప్రసారమయ్యే ఈ షో కౌన్ బనేగా కరోడ్ పతి షో సరికొత్త సీజన్. ఈ షోకు సంబంధించిన టీజర్ ఈ రోజు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్ కు ఎన్టీఆర్ హాజరు అయ్యాడు. సహజంగా స్టార్ హీరోలు బయట కనపడరు. పైగా ఎన్టీఆర్ చాలా రోజులుగా ఆర్ఆర్ఆర్ తో బిజీగా ఉన్నారు.

దానితో ఆయనను మిసైన ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఆ షోకి సంబంధించిన ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేసారు. అయితే ఈ లోగా వారికి ఇంకో షాక్ తగిలింది. జెమినీ టీవీ వారు సోషల్ మీడియాలోని సదరు ఫోటోలకు, వీడియోలకు కాపీరైట్ నోటీసులు పంపడం మొదలుపెట్టారు.

ఏదైనా ట్విట్టర్ అకౌంట్ కు అటువంటి మూడు నోటీసులు వస్తే… ఆ అకౌంట్ ని ట్విట్టర్ తీసేస్తుంది. ఎంతో కష్టపడి పోగేసిన అకౌంట్లు అకారణంగా పోతే ఫ్యాన్స్ బాధ మాటల్లో చెప్పలేం. వారు ఈ విషయంగా జెమినీ టీవీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరో టీంని కాంటాక్ట్ చేసి ఆ ఇష్యూని కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.