Jr NTR -Aravindha -Sametha - Hit or flopజూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రంగా “అరవింద సమేత” నిలిచిందని చెప్పడంలో సందేహం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిందా? సూపర్ హిట్ సాధించినట్లేనా? యావరేజ్ తో సరిపెట్టుకుందా? నష్టాలను మిగిల్చిందా? ఎలాంటి ఫలితాన్ని సాధించింది? అంటే….

ఓవరాల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఫిగర్ ను చేరుకోవడంలో సక్సెస్ సాధించిన “అరవింద సమేత,” ఇంకా కొన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కు చేరుకోలేదు. తొలుత యుఎస్ నుండి మొదలుపెడితే… తొలిరోజు ప్రీమియర్ షోల తర్వాత ఆశించిన రీతిలో ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పలకలేదు. దీంతో తొలి వీకెండ్ ముగిసేపాటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు అసాధ్యమని తేలిపోయింది.

దీంతో యుఎస్ మార్కెట్ లో 2 మిలియన్స్ పైగా కొల్లగొట్టి, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచినప్పటికీ నష్టాలనే మిగిల్చిందన్నది స్పష్టం. ప్రీ రిలీజ్ బిజినెస్ ను దాటిన ఏరియాలలో నైజాం, గుంటూరులు నిలువగా, మిగిలిన ఏరియాలలో దాదాపుగా ప్రీ రిలీజ్ ఫిగర్ ను చేరుకునేలా కనపడుతోంది.

రెండవ వారంలో ఆశించిన స్థాయి కంటే ఈ సినిమా కలెక్షన్స్ బాగా నెమ్మదించడంతో ఇప్పటివరకు బ్రేక్ ఈవెన్ దశకు చేరుకోలేకపోయిందన్నది ట్రేడ్ వర్గాల విశ్లేషకుల టాక్. ఇదే సమయంలో మిగిలిన పెద్ద చిత్రాల మాదిరి భారీ నష్టాలను కూడా ఈ సినిమా మిగల్చకపోవడంతో, మొత్తంగా బాక్సాఫీస్ వద్ద ‘యావరేజ్’గా నిలిచే సంకేతాలు కనపడుతున్నాయి.