Jr NTR aravinda sametha photo leakఅగ్ర హీరోలు నటిస్తున్న సినిమాలు మరియు ట్రేడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ లుగా పరిగణించే మూవీలకు లీకేజ్ పెద్ద ఇబ్బందిగా మారుతోంది. ఆ క్రమంలోనే త్రివిక్రమ్ – జూనియర్ ఎన్టీఆర్ ల ‘అరవింద సమేత’ ఇటీవల లీకేజ్ బారిన పడిన విషయం తెలిసిందే. అయితే వాటిని నియత్రించడానికి షూటింగ్ సెట్ లోకి త్రివిక్రమ్ మొబైల్ ఫోన్స్ ను కూడా అనుమతించకుండా చర్యలు చేపట్టినట్లుగా వార్తలు వెలువడ్డాయి.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా… ఈ సినిమా నుండి తాజాగా మరో స్టిల్ లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కుర్తా, జీన్స్ వేసుకుని నడుస్తోన్న జూనియర్ ఎన్టీఆర్ స్టిల్ ఫ్యాన్స్ ను అమితంగా ఆకర్షిస్తోంది. అయితే షూటింగ్ స్పాట్ లో ఇలాంటి ఫోటోలను క్లిక్ చేసి, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేయడం సర్వసహజంగా జరిగేదే గానీ, సినిమాలో ఫుటేజ్ లీక్ కాకుండా చూసుకోవాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.