Jr NTR Son Speaks Abhay Ram, Jr NTR About Pranitha Abhay Ram, Tarak Abhay Ram Janatha Garage Promotions, Jr NTR Speaks Son Abhay Ram Pranitha‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాల వరకు మామూలుగానే ఉండేవాడిని ఆ తర్వాతే తాను మారాలని నిర్ణయించుకున్నాను అని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. సినిమా పద్ధతులు మారాయి. వరల్డ్ వైడ్ సినిమా మారిపోయింది. ప్రపంచమంతా మారుతోంది కాబట్టి, ఆ మార్పులో మనం కూడా ఉంటే బాగుందనిపించింది. అందుకే, ఈ ఫిల్మ్ చేసేటప్పుడు యాక్టింగే కాకుండా, మన లుక్ కూడా మారితే ఇంకా బాగుంటందనిపించింది… అందుకే నా లుక్ మార్చాను… అంటూ తన మేకోవర్ పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.

ఈ సందర్భంగా తన అబ్బాయి అభయ్ రామ్ కు సంబంధించిన విశేషాలు కూడా పంచుకున్నారు. “తన ముద్దుల కొడుకు అభయ్ రామ్ మట్టిలో బాగా ఆడుకుంటున్నాడని, అల్లరి చేసినప్పుడు మందలిస్తే, తిరిగి గట్టిగా కొడుతున్నాడని, తన కొడుకు కోసం వీలైనంత ఎక్కువ సమయం కేటాయిస్తున్నానని, తండ్రి అన్న అనుభూతి ఏంటో ఇప్పుడు తనకు అర్థమైందని” యంగ్ టైగర్ చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కానున్న ‘జనతా గ్యారేజ్’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా సదరు సంగతులన్నీ మీడియా వర్గీయులతో పంచుకున్నారు.