After-Missing-Jr-NTR,-Fans-Plan-A-Unique--Featయంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అరవింద సమేత చిత్రం ఎన్టీఆర్ కేరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇదే కలయికలో ఇప్పుడు మరొక చిత్రం త్వరలో ప్రారంభం కాబోతోంది. RRR చిత్రం తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోయే చిత్రం. హారిక హాసిని మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ల పై స్. రాధాకృష్ణ (చినబాబు) మరియు నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి నుండి షూటింగ్ కు వెళుతుంది.

ఈ చిత్రాన్ని 2021 వేసవి కి విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికం గా ప్రకటించింది. ఎప్పటి నుండొ అభిమానులు ఎదురు చూస్తున్న ఈ అనౌన్స్మెంట్ నేడు అధికారికం గా వెలువడింది. ఇతర నటీ నటుల మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం అని చిత్ర బృందం తెలిపింది.

సరిగ్గా ఆర్ఆర్ఆర్ విడుదలైన మూడు నెలలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. త్రివిక్రమ్ ఇప్పుడే అల వైకుంఠపురంలో వంటి పెద్ద హిట్ ఇచ్చాడు. దీనితో ఈ సినిమా పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే త్రివిక్రమ్ ఈ సారి ఎటువంటి సినిమా తీస్తారా అని సర్వత్రా చర్చ జరుగుతుంది.

అరవింద సమేత విషయంలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ శైలిలో సినిమా తీశారు. అయితే త్రివిక్రమ్ శైలిలో తమ హీరోని చూసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అదే శైలిలో తీస్తే ఫలితం కూడా మెరుగుగా ఉంటుందని వారు అనుకుంటున్నారు. దీనితో ఎన్టీఆర్ త్రివిక్రమ్ శైలిలోకి మారతారా లేక త్రివిక్రమ్ మళ్ళీ ఎన్టీఆర్ శైలిలో సినిమా తీస్తారా అనే చర్చ నడుస్తుంది.