jokes on Sr NTR anad balakrishna in Mathu Vadalara movieసంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా అరంగేట్రం చేసిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై డివైడ్ టాక్ వినిపిస్తుంది. కొంత మంది బావుంది అని అంటుంటే కొంత మందికి నచ్చలేదు అంటున్నారు.

ఇక అసలు సినిమా విషయానికి వస్తే…. మెరుగైన ప్రయత్నం అనే చెప్పుకోవాలి. కథ సాదాసీదాగానే ఉన్నా న్యూ-ఏజ్ ఫిలిం మేకింగ్ తో సరికొత్తగా చూపాలనే ప్రయత్నం చేశారు. అందులో పూర్తి స్థాయిలో సఫలీకృతం కాలేకపోయారు. అయితే సత్య కామెడీ ట్రాక్ ఇరగదీసింది. ఇది ఇలా ఉండగా సినిమా మీద ఒక వివాదం కూడా మొదలయ్యింది.

చిరంజీవి అంటే ఈ ద‌ర్శ‌కుడికి బాగా ఇష్టం అనుకుంటా. ఈ సినిమా చిరు తో మొద‌ల‌వుతుంది. చిరుతో ఇంట్ర‌వెల్ ఇచ్చాడు. చిరుని చూపించే సినిమాని ముగించాడు. ఆయా చిరంజీవి పాత సినిమాలలోని బిట్లను చూపించాడు. అయితే ఇదే సమయంలో పలు చోట్ల బాలయ్యను, పెద్ద ఎన్టీఆర్ లను కామెడీ చెయ్యడం గమనార్హం.

వారి మీద జోకులు వేస్తూ కామెడీ పండించే ప్రయత్నం చేశారు. మొదటి సినిమాలోనే ఇటువంటి వివాదాలలోకి వెళ్లడం అనవసరమనే చెప్పుకోవాలి. రాజమౌళి, కీరవాణి వంటి వారి పర్యవేక్షణలో ఇది జరగడం నందమూరి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఇలా ఉండగా క్రిస్మస్ సందర్భంగా ఈరోజు విడుదలైన ఈ సినిమా, రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే లకు పూర్ ఓపెనింగ్స్ రావడం గమనార్హం.