Joke-on-Australia-vs-England-Champions-Trophy-20172017 ఛాంపియన్స్ ట్రోఫీ నుండి ఆస్ట్రేలియా జట్టును విజయవంతంగా బయటకు పంపించడంలో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు పూర్తిగా సక్సెస్ సాధించింది. అయితే ఈ విషయం టాస్ వేసినపుడే ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కు తెలుసా? నిజంగా చెప్పలేం గానీ, ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో హల్చల్ చేస్తోన్న ఓ జోక్ ప్రకారం అయితే ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ముందు తెలిసినట్లు భావించాలి. ఇంతకీ అంతలా సందడి చేస్తోన్న ఆ జోక్ ఏంటంటే…

టాస్ వేసినపుడు అక్కడున్న ఇరువురు కెప్టెన్లు స్మిత్ – మోర్గాన్ నడుమ జరిగిన సరదా సంభాషణగా ఈ మెస్సేజ్ వైరల్ అవుతోంది. టాస్ వేయగానే పైకి చూసిన ఆసీస్ కెప్టెన్ స్మిత్… చాలా మబ్బు పట్టి ఉంది సోదరా అని చెప్పగానే, దానికి మోర్గాన్ ‘మీ కోసం సిల్వర్ కలర్ లో ఒకటి సిద్ధమవుతోంది… అని చెప్పగానే వెంటనే స్మిత్… ఏంటది అని ఎదురుప్రశ్న వేస్తాడు. దీంతో మోర్గాన్… ‘ఆ ఫ్లైట్ చూడండి… అది నేరుగా ఆస్ట్రేలియాకే వెళ్తుందని చెప్పడంతో’ అవాక్కయ్యే పరిస్థితి నెలకొంది.

అయితే ఆసీస్ కెప్టెన్ స్మిత్ కు ఆ విషయం… మ్యాచ్ ముగిసిన తర్వాత గానీ అర్ధం కాలేదు…!
Joke-on-Australia-vs-England-Champions-Trophy-2017