jogi ramesh talks Obscene language about ragurama krisgnamrajuగవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుపై ఎమ్మెల్యే జోగి రమేష్ సంబంధం లేకపోయినా విరుచుకుపడ్డారు. అది కూడా నీతి బాహ్యమైన భాషలో. పార్టీ గుర్తు, నాయకుడి ఫోటోతో గెలిచారన్నారు. ఆయన రాజీనామా చేస్తే వార్డ్ మెంబెర్‌గా కూడా గెలవలేరని అన్నారు.

అంతటితో ఆపేస్తే పర్లేదు కానీ ఎంపీపై జోగి రమేష్ మీడియాలో రాయలేని అనుచిత భాషలో వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తరువాత తాను మాట్లాడిన విషయాల్లో తప్పులుంటే రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. అయితే సదరు ఎమ్మెల్యే అభ్యంతరకర భాషను స్పీకర్ తో సహా ఎవరూ తప్పుపట్టలేదు.

ఆ తరువాత సీఎం జగన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే జోగి రమేష్‌కు థ్యాంక్స్ చెబుతూ అభినందించారు. జోగి రమేష్ బాధలో ఆప్యాయత కనిపించిందని, అందుకే అతనికి థాంక్స్ చెబుతున్నానని అన్నారు. అలాగే తప్పుచేసి ఉంటే రికార్డుల నుంచి ఆ పదాలను తొలగించాలని జోగి రమేష్‌ స్పీకర్‌ను కొరడం అభినందించ తగ్గ విషయమని సీఎం జగన్ అన్నారు.

అయితే ఇప్పటివరకు రాజకీయనాయకుల మీడియా చర్చలకు, ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితమైన అసభ్యకర భాష శాసనసభలోకి కూడా ప్రవేశించడం పై మాట్లాడిన వారిలోనూ, విన్న వారిలోనూ విచారం వ్యక్తం కాలేదు. పైగా సభానాయకుడికి అటువంటి భాష బాధలో ఆప్యాయత గా కనిపించడం శోచనీయం అంటూ పలువురు అంటున్నారు. అది ఆప్యాయత కాదు భజన అంటూ మరికొందరు సీఎం కు సోషల్ మీడియాలో చెప్పే ప్రయత్నం చెయ్యడం విశేషం.