Jofra Archer on Rohit Sharmaఇంగ్లాండ్ క్రికెటర్ అయిన జోఫ్రా ఆర్చర్ కు ‘ట్విట్టర్ బాబా’గా ఉన్న గుర్తింపు సోషల్ మీడియా జనులకు తెలిసిందే. కొన్ని ఏళ్ళ క్రితం నాటి ట్వీట్స్ నిజమవుతున్న వేళ నాటి ట్వీట్స్ స్క్రీన్ షాట్స్ ను షేర్ చేసుకుంటూ నెటిజన్లు సందడి చేస్తుంటారు.

అయితే ఇపుడు ఆ వంతు టీమిండియా టీ20 కెప్టెన్ గా నియమితుడైన రోహిత్ శర్మ ట్వీట్ కు వచ్చింది. తొలిసారిగా ముంబై జట్టుకు కెప్టెన్ గా ఎంపికైన సందర్భంలో 2012 నవంబర్ 7వ తేదీన ‘జైపూర్ లో అడుగుపెట్టాం, జట్టును లీడ్ చేయడం మరింత బాధ్యతను పెంచింది’ అంటూ చేసిన ట్వీట్ 2021 నవంబర్ 17వ తేదీతో మ్యాచ్ అవుతోంది.

అదే జైపూర్ లో పూర్తి స్థాయి కెప్టెన్ గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్ లో కివీస్ తో తలపడిన టీమిండియా జట్టు చివరి ఓవర్లో జయకేతనాన్ని ఎగురవేసింది. మూడు టీ 20ల సిరీస్ లో తొలి మ్యాచ్ లో గెలవడంతో 1-0తో టీమిండియా లీడ్ చేస్తోంది.